శ్రీకాలభైరవ స్వామిని దర్శించుకోనున్న సీఎం
చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం ఎల్లుట్ల పంచాయతీలోని శీలంవారిపల్లెలో వెలసిన శ్రీకాలభైరవ స్వామివారిని ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ దర్శించుకోనున్నారు. చిత్తూరు జిల్లా కలికిరి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరనున్న సీఎం, శీలంవారిపల్లెలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగుతారు. అక్కడ్నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకుని స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం కడపజిల్లా రాయచోటిలో జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి హాజరవుతారు.